News
ఎవిస్ ఆస్పత్రి అధినేత డాక్టర్ రాజా హైదరాబాద్ జూన్ 3:- ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు ఈనెల 13న హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ప్రాంతంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎవిస్ హాస్సిటల్స్ అధినేత డాక్టర్ రాజా తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు.ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా జిహెచ్ ఎంసీ అనుమతితో డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అదే రోజున పోలీసు శాఖకు చెందిన, అధికంగా రక్తనాళాలు ఉబ్బి తీవ్ర అనారోగ్యసమస్యను ఎదుర్కోనే సిబ్బందికి తమ ఆస్సత్రిలో మద్యాహ్నం ఉచిత స్ర్కీనింగ్ టెస్ట్, ఇతర సదుపాయాలను అందిస్తామని వివరించారు. ఈ మేరకు ఆ శాఖకు లేఖ రాసామన్నారు. వెరికోస్ వెయిన్స్ (కాళ్ల రక్తనాళాలు ఉ బ్బటం) ఆపరేషన్లలో దక్షిణ భారతదేశంలోనే తమ ఆస్సత్రి అగ్రగామిగా నిలిచిందన్నారు. అదే విధంగా తమ ఆస్సత్రిని డేకేర్ సెంటర్‌గా తీర్చిదిద్దామని, కేన్సర్‌తో సహా ఎటువంటి ఆపరేషన్ అయినా ఒకరోజులో పూర్తిచేసి రోగిని ఇంటికి ఆరోగ్యప్రదంగా పంపుతామని డాక్టర్ రాజా చెప్పారు. కేవలం అమెరికా, లండన్ వంటి పాశ్చాత్యదేశాలకే పరిమితమైన నాన్ కార్డియాక్ కేత్‌లాబ్ విధానం కేవలం తమ ఆస్పత్రిలోనే ఉందని తెలిపారు.సాధారణంగా భారత దేశంలో మహిళలకు అధిక రుతుస్రావం అయితే గర్భసంచి తొలగించి వారిని సంతానాప్రాప్తికి దూరం చేస్తారని, కానీ గర్బసంచికి హానిచేసే రక్తనాళాలను మాత్రమే మూసివేసి ఫైబ్రాయిడ్ ఎంబలైజేన్ అనే సాధారణ విధానం ద్వారా ఎటివంటి కోత, కుట్లు లేకుండా వారి సమస్యను నయం చేయవచ్చునని, దీని వల్ల వారికి సంతానోత్పత్తికి ఎటువంటి విఘాతం ఉండదని, తాము ఈ ఆధునిక విధానాన్ని అమలు చేస్తున్నామని డాక్టర్ రాజా తెలిపారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేకుండా కేన్సర్‌ను నయం చేసే ఆధునిక చికిత్పా విధానాలు తమ వద్ద ఉన్నాయని, ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








